నాలుగు నెలల్లో సువర్ణయుగం: వైఎస్ జగన్ | YS Jaganmohan Reddy inagurates YSR statue | Sakshi
Sakshi News home page

నాలుగు నెలల్లో సువర్ణయుగం: వైఎస్ జగన్

Jan 26 2014 3:08 PM | Updated on May 25 2018 9:12 PM

పేదవాడి వైద్యం కోసం ఆరాటపడింది దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక్కరేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.

చిత్తూరు: పేదవాడి వైద్యం కోసం ఆరాటపడింది దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక్కరేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగిస్తున్నారు. ఆదివారం నిండ్రలో వైఎస్ఆర్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు.

నిండ్ర సభలో జగన్ మాట్లాడుతూ.. పేదవారికి వైఎస్ఆర్ దిక్కుగా నిలిచారని అన్నారు. నాలుగు నెలల్లో సువర్ణయుగం తెచ్చుకుందామని, కుట్రతో రాజకీయాలు చేసేవారు ఈ ఉప్పెనలో కొట్టుకుపోతారని జగన్ అన్నారు.  రాజకీయమంటే చనిపోయాక కూడా బతకడానికి ఆరాటపడడమేనని పేర్కొన్నారు. ప్రస్తుతం కుట్రలు, కుతంత్రాలతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. త్వరలో రాజకీయవ్యవస్థలో మార్పులొస్తాయని జగన్ ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement