269వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌ | YS Jagan PrajaSankalpaYatra 269th Day Schedule Released | Sakshi
Sakshi News home page

Sep 23 2018 7:36 PM | Updated on Sep 19 2019 2:50 PM

YS Jagan PrajaSankalpaYatra 269th Day Schedule Released - Sakshi

సాక్షి, విశాఖపట్నం ​: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 269వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. రాజన్న బిడ్డ చేపట్టిన పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. సోమవారం జననేత పాదయాత్రను పెందుర్తి నుంచి ప్రారంభిస్తారు. అక్కడ నుంచి సారిపల్లి, జంగాలపాలెం, చింతలపాలెం, తాడివానిపాలెం, దేశపాత్రునిపాలెం, కొత్తవలస మీదుగా తుమ్మికపాలెం వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. దేశపాత్రునిపాలెం వద్ద జననేత మూడు వేల కిలోమీటర్ల మైలురాయిని దాటనున్నారు. ఈ మేరకు వైఎస్సార్‌సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement