268వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌ | YS Jagan PrajaSankalpaYatra 268th Day Schedule Released | Sakshi
Sakshi News home page

Sep 22 2018 8:40 PM | Updated on Sep 23 2018 8:44 AM

YS Jagan PrajaSankalpaYatra 268th Day Schedule Released - Sakshi

సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 268వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. రాజన్న బిడ్డ చేపట్టిన పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఆదివారం ఉదయం జననేత పాదయాత్రను భీమిలీ నియోజకవర్గంలోని అనందపురం మండలం నుంచి ప్రారంభిస్తారు. అక్కడి నుంచి గండిగుండం కాలనీ, అక్కిరెడ్డిపాలెం, జుట్టాడ క్రాస్‌ మీదుగా  పెందుర్తి మండంలంలోని పాత్రులునగర్‌ చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్న విరామం తీసుకుంటారు. అనంతరం పెందుర్తి, రాయవరపువాని పాలెం మీదుగా సారిపల్లి కాలనీ వరకు ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement