అండగా ఉంటాం: అనూహ్య తండ్రికి జగన్ భరోసా | Ys jagan mohan reddy assures to support Anuhya Family | Sakshi
Sakshi News home page

అండగా ఉంటాం: అనూహ్య తండ్రికి జగన్ భరోసా

Jan 21 2014 1:14 AM | Updated on Jul 25 2018 4:09 PM

‘ఎంతో భవిష్యత్తు ఉన్న అనూహ్య హత్యకు గురి కావటం చాలా బాధగా ఉంది.. ఈ కష్టంలో మేం మీకు అండగా ఉంటాం..’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం అనూహ్య తండ్రి శింగవరపు ప్రసాద్‌కు భరోసా ఇచ్చారు.

మచిలీపట్నం, న్యూస్‌లైన్: ‘ఎంతో భవిష్యత్తు ఉన్న అనూహ్య హత్యకు గురి కావటం చాలా బాధగా ఉంది.. ఈ కష్టంలో మేం మీకు అండగా ఉంటాం..’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం అనూహ్య తండ్రి శింగవరపు ప్రసాద్‌కు భరోసా ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో సమైక్య శంఖారావం యాత్రలో ఉన్న ఆయన ప్రసాద్‌ను ఫోన్‌లో పరామర్శించారు. అనూహ్య కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి, దోషులకు శిక్ష పడేలా చూడాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరతామని చెప్పారు. అవసరమైతే వైఎస్సార్‌సీపీ తరఫున ఎంపీల బృందాన్ని మహారాష్ట్రకు పంపుతామన్నారు. దోషులకు శిక్ష పడేవరకు పోరాడతామని హామీ ఇచ్చారు. పార్లమెంటులో కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని జగన్ చెప్పారు. క్రైస్తవ మత బోధకుడు బ్రదర్ అనిల్  కుమార్ కూడా సోమవారం అనూహ్య తండ్రిని ఫోన్‌లో పరామర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement