300వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌ | YS Jagan 300th day Prajasankalpayatra Schedule released | Sakshi
Sakshi News home page

300వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

Nov 17 2018 7:53 PM | Updated on Nov 18 2018 8:19 AM

YS Jagan 300th day Prajasankalpayatra Schedule released - Sakshi

సాక్షి, విజయనగరం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 300వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. రాజన్న బిడ్డ చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఆదివారం జననేత పార్వతీ పురం నియోజకవర్గంలోని కోటవాని వలస నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి బంతువాణి వలస, అడ్డపుశీల క్రాస్‌, బచి జంక్షన్‌, సీతాపురం క్రాస్‌ మీదుగా కురుపమ్‌ నియోజక వర్గంలోకి ప్రవేశిస్తారు.

ఉల్లిభద్ర, గరుగుబిలి క్రాస్‌, కే రామినాయుడు వలసక్రాస్‌, తోట పల్లి రిజర్వాయర్‌ వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు వైఎస్సార్‌సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement