ప్రమాదవశాత్తూ క్వారీ కార్మికుడి మృతి | Worker accidental death | Sakshi
Sakshi News home page

ప్రమాదవశాత్తూ క్వారీ కార్మికుడి మృతి

Aug 31 2015 5:20 PM | Updated on Apr 3 2019 7:53 PM

క్వారీలో పనిచేస్తున్న కార్మికుడు ప్రమాదవశాత్తూ జారి పడి మృతిచెందిన సంఘటన గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం ఎర్రకొండపై సోమవారం జరిగింది.

ఎడ్లపాడు (గుంటూరు) : క్వారీలో పనిచేస్తున్న కార్మికుడు ప్రమాదవశాత్తూ జారి పడి మృతిచెందిన సంఘటన గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం ఎర్రకొండపై సోమవారం జరిగింది. వివరాల ప్రకారం.. గ్రామంలోని కొండపై ఉన్న క్వారీలో ఒడిశా రాష్ట్రానికి చెందిన ఇద్దరు కార్మికులు డ్రిల్లింగ్ నిర్వహిస్తుండగా.. ప్రమాదవశాత్తూ జారి పడి ఒక యువకుడు మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement