కాకినాడ రూరల్ మండలం చీడిగలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ దుర్మరణం పాలైంది.
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి.
Sep 20 2013 12:56 AM | Updated on Sep 1 2017 10:51 PM
కాకినాడ రూరల్, న్యూస్‌లైన్ :కాకినాడ రూరల్ మండలం చీడిగలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ దుర్మరణం పాలైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కాకినాడ నగరానికి చెందిన రావి అరుణ (31) గురువారం ఉదయం మోటారు సైకిల్‌పై తన పుట్టింటికి రామేశ్వరం వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది.కాకినాడ నుంచి రేషన్ షాపులకు సరుకులు తరలిస్తున్న ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్ చేస్తుండగా ఇంజన్ వెనుక చక్రానికి మోటార్‌సైకిల్ హ్యాండిల్ తగిలి ఆమె రోడ్డుపై పడిపోయింది. ట్రక్కు చక్రాలు ఆమె మీదనుంచి వెళ్లిపోవడంతో అరుణ అక్కడికక్కడే మృతి చెందింది.పోలీసులు మృతదేహాన్ని కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. కుటుంబసభ్యులు సంఘటన స్థలంలో బోరున విలపించారు. కేసును ఇంద్రపాలెం ఎస్సై మురళీకృష్ణ దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement


