మహిళా రైతు ఆత్మహ త్య | Women farmer suicide | Sakshi
Sakshi News home page

మహిళా రైతు ఆత్మహ త్య

Oct 26 2015 2:30 PM | Updated on May 3 2018 3:17 PM

అప్పుల బాధ భరించలేక మహిళా రైతు ఆత్మహత్య చేసుకుంది

అప్పుల బాధ భరించలేక మహిళా రైతు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలం అక్కిరెడ్డిపాలెం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నారపిన్ని కాసులమ్మ(45) తనకున్న 90 సెంట్ల(ఎకరానికి కొంచె తక్కువ) భూమిలో కూరగాయాలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.

ఈ క్రమంలో పిల్లల పెళ్లిళ్ల కోసం చేసిన అప్పులతో పాటు పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు 10లక్షల వరకూ పెరిగి పోవడంతో.. వాటిని తీర్చే దారి కానరాక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు ఆమెను అనకాపల్లి ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందింది.
 

Advertisement
 
Advertisement
Advertisement