వివాహిత సజీవదహనం | woman suicide in krishna district over mental illness | Sakshi
Sakshi News home page

వివాహిత సజీవదహనం

Jan 30 2016 3:29 PM | Updated on Nov 6 2018 5:47 PM

మతి స్థిమితం లేని మహిళ కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకోవడంతో మృతిచెందిన ఘటన కృష్ణాజిల్లాలో జరిగింది.

కృష్ణాజిల్లా: మతి స్థిమితం లేని మహిళ కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకోవడంతో మృతిచెందిన ఘటన కృష్ణాజిల్లాలో జరిగింది. కంకిపాడు మండలం ఆకునూరు గ్రామానికి చెందిన అర్జున్‌రావు, శ్రీలక్ష్మీ(36) భార్యాభర్తలు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

ఈ క్రమంలో నాలుగేళ్ల క్రితం శ్రీలక్ష్మీ అనారోగ్యానికి గురై మతిస్థిమితం కోల్పోయింది. అప్పటి నుంచి ఆమెకు చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఇది గుర్తించిన స్థానికులు ఆమెను కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement