రైలు ఢీకొని మహిళ మృతి | Woman dies in Train accident | Sakshi
Sakshi News home page

రైలు ఢీకొని మహిళ మృతి

Jul 27 2015 4:47 PM | Updated on Sep 3 2017 6:16 AM

రైలు పట్టాలు దాటుతున్న మహిళ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఢీకొని మృతిచెందింది.

వైఎస్సార్‌జిల్లా : రైలు పట్టాలు దాటుతున్న మహిళ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఢీకొని మృతిచెందింది. ఈ సంఘటన వైఎస్సార్ జ్లిలా నందలూరు రైల్వే గేటు సమీపంలో సోమవారం జరిగింది. వివరాల ప్రకారం.. మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సుబ్బమ్మ(52) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.

ఈ క్రమంలో నందలూరుకు వచ్చిన ఆమె రైలు గేటు వేసి ఉన్న సమయంలో గేటు కింది నుంచి వెళ్లి పట్టాలు దాటడానికి ప్రయత్నించింది. అదే సమయంలో వచ్చిన సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement