విశాఖ ఎయిర్పోర్టులో 'బుల్లెట్' కలకలం | Woman caught with a revolver bullet at Vizag Airport | Sakshi
Sakshi News home page

విశాఖ ఎయిర్పోర్టులో 'బుల్లెట్' కలకలం

Aug 18 2014 9:24 AM | Updated on May 3 2018 3:17 PM

విశాఖ ఎయిర్పోర్టులో 'బుల్లెట్' కలకలం - Sakshi

విశాఖ ఎయిర్పోర్టులో 'బుల్లెట్' కలకలం

స్నేహితుల దినోత్సవం రోజున ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్ ఓ యువతిని జైలు పాల్జేసింది.

విశాఖపట్నం: స్నేహితుల దినోత్సవం రోజున ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్ ఓ యువతిని జైలు పాల్జేసింది. అనుమానాస్పద వస్తువు ఉందన్న అనుమానంతో గురుప్రీత్ కౌర్(22) అనే యువతిని విశాఖ విమానాశ్రయంలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద రివాల్వర్ బుల్లెట్ ఉండడంతో అధికారులు అవాక్కయ్యారు. ఆమెను అదుపులోకి విచారించారు.

ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఈ బుల్లెట్ తనకు ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చిందని ఆమె తెలిపినట్టు పోలీసులు వెల్లడించారు. పూణెలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న కౌర్ మంచి ఉద్యోగం కోసం ఇక్కడికి వచ్చింది. పూణెకు తిరిగి వెళుతూ బుల్లెట్ తో దొరికిపోయింది. ఆమె తండ్రి నావికాదళంలో పనిచేస్తున్నారు. బుల్లెట్ కలిగివున్నందుకు ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం ఆమెను కోర్టులో ప్రవేశపెట్టనుట్టు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement