రాగల 24 గంటల్లో ఏపీ, తెలంగాణలో వర్షాలు | With in 24 hours Rains in telangana and andhra pradesh | Sakshi
Sakshi News home page

రాగల 24 గంటల్లో ఏపీ, తెలంగాణలో వర్షాలు

Apr 28 2015 11:18 AM | Updated on Sep 3 2017 1:02 AM

మహారాష్ట్రలోని విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి అవరించి ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం మంగళవారం తెలిపింది.

విశాఖపట్నం: మహారాష్ట్రలోని విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి  అవరించి ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం మంగళవారం తెలిపింది. తెలంగాణ, రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడిందని పేర్కొంది.

దాంతో రాగల 24 గంటల్లో ఏపీ, తెలంగాణలో కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. అయితే ఈ రోజు సాయంత్రానికి క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement