శాడిస్టుకు దేహశుద్ధి

Wife And Relatives Beat Sadist Husband in Kurnool - Sakshi

చితకబాదిన భార్య, బంధువులు

కర్నూలు, డోన్‌: ఓ శాడిస్టుకు భార్యతో పాటు ఆమె తరఫు బంధువులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన సోమవారం డోన్‌ పట్టణ పోలీసుస్టేషన్‌ ఎదుట చోటుచేసుకుంది.  వివరాలిలా.. డోన్‌ తారకరామనగర్‌కు చెందిన కావ్యకు గత డిసెంబర్‌ 7న అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన అరవింద్‌తో వివాహమైంది. పెళ్లయిన నాటి నుంచే ఆమెను అదనపు కట్నం కోసం వేధించడమే కాకుండా శారీరకంగా చిత్రహింసలు పెట్టేవాడు. పైగా వాటిని వీడియో తీసేవాడు. దీంతో వారం క్రితం ఆమె తన భర్తపై డోన్‌ పట్టణ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణకు పిలవడంతో అరవింద్‌ సోమవారం స్టేషన్‌ సమీపంలోకి రాగానే కావ్య, ఆమె తరఫు బంధువులు మూకుమ్మడిగా దాడి చేశారు. చెప్పులతో కొడుతూ..కాళ్లతో తంతూ దేహశుద్ధి చేశారు. దీంతో పోలీసులు అప్రమత్తమై వారిని నియంత్రించడంతో అరవింద్‌ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని స్టేషన్‌లోకి పరుగు తీశాడు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top