‘ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తాం’ | We Will Fill Teacher Posts Says Minister Adimulapu Suresh | Sakshi
Sakshi News home page

‘ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తాం’

Aug 10 2019 7:20 PM | Updated on Aug 10 2019 7:40 PM

We Will Fill Teacher Posts Says Minister Adimulapu Suresh - Sakshi

సాక్షి, తాడేపల్లి : త్వరలోనే ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. శనివారం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆదిమూలపు సురేష్‌ పాల్గొన్నారు. సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  ప్రైమరీ స్కూళ్లలో మౌలిక సదుపాయాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారని తెలిపారు. మండలానికి ఒక పాఠశాలను ముందుగా ఆధునీకరిస్తామన్నారు. విద్యార్థుల రేషియోను బట్టి ఉపాధ్యాయులను నియమించేందుకు వీలుగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. యునిసెఫ్ ఆధ్వర్యంలో కేరియర్ కౌన్సిల్ పోర్టర్ యాప్‌ను స్కూళ్లకు అనుసంధానం చేశామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement