కర్నూలు జిల్లాలోని సుంకేశుల జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది.
కర్నూలు : కర్నూలు జిల్లాలోని సుంకేశుల జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో మంగళవారం నాటికి సుంకేశుల నీటి మట్టం 291.90 అడుగులకు చేరింది. ప్రస్తుతం నీటి నిల్వలు 1.19 టీఎంసీలు కాగా, ఇన్ఫ్లో 42 వేలు, ఔట్ ఫ్లో 40,014 క్యూసెక్కులుగా ఉంది. నీటి నిల్వలు పెరుగుతుండటంతో సుంకేశుల నుంచి శ్రీశైలం జలశయానికి నీటిని విడుదల చేస్తున్నారు.