విశాఖలో రోడ్డు ప్రమాదం: ఇద్దరి మృతి | vizag accident two persons died | Sakshi
Sakshi News home page

విశాఖలో రోడ్డు ప్రమాదం: ఇద్దరి మృతి

Oct 17 2015 8:53 AM | Updated on Aug 25 2018 5:33 PM

విశాఖలో రోడ్డు ప్రమాదం: ఇద్దరి మృతి - Sakshi

విశాఖలో రోడ్డు ప్రమాదం: ఇద్దరి మృతి

విశాఖపట్టణం ఎన్‌ఏడి జంక్షన్‌లో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

విశాఖపట్టణం : విశాఖపట్టణం ఎన్‌ఏడి జంక్షన్‌లో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మట్టి లోడుతో వస్తున్న లారీ అదుపుతప్పి ఆగి ఉన్న ఆటోపై పడింది. దీంతో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. వెంటనే స్థానికులు క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టు మార్టం కోసం తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.  ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement