breaking news
vizag accident
-
అక్కా.. నన్ను చంపేస్తారు..!
విశాఖపట్నం: రెక్కాడితే గానీ డొక్కాడని సామాన్య మత్స్యకార కుటుంబం వారిది. కష్టాల కడలిని ఈదుతూ నాలుగు రాళ్లు సంపాదించుకునేందుకు పొరుగు జిల్లా నుంచి వలసొచ్చిన ఆ కుటుంబంలో తీరని విషాదం అలుముకుంది. రాత్రి ‘బయటకు వెళ్లి వస్తా’నని చెప్పి వెళ్లిన వ్యక్తి.. తెల్లవారేసరికి సముద్రతీరంలో విగతజీవిగా కనిపించడంతో భార్యాపిల్లలు, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. సముద్రపు ఒడ్డున రక్తపు మడుగులో.. వన్ టౌన్ సీఐ వరప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందిన మైలపల్లి చంటి(30) కొంతకాలంగా విశాఖ ఫిషింగ్ హార్బర్లో చేపలవేట చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్య, పిల్లలతో కలిసి స్థానిక పెయిన్దొరపేటలో నివాసం ఉంటున్నాడు. వారం రోజులుగా వేటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్న చంటి, ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో బయటకు వెళ్లాడు. సోమవారం ఉదయం నేవల్ కోస్టల్ బ్యాటరీ సమీపంలోని గంగాలమ్మ గుడి వద్ద రక్తపు మడుగులో కనిపించాడు. చంటిని గుర్తించిన స్థానిక మత్స్యకారులు పోలీసులకు సమాచారం అందించారు. గుర్తు తెలియని వ్యక్తులు అతడి తలపై కర్రలతో బలంగా కొట్టి, మెడకు నైలాన్ తాడు బిగించి అత్యంత కిరాతకంగా హతమార్చినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ముందే ఊహించినా.. దక్కని ప్రాణం ఈ దారుణం వెనుక పక్కా ప్రణాళిక ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు వ్యక్తులు తనను చంపేస్తామని బెదిరిస్తున్నట్లు ఆదివారమే చంటి తన సోదరి అప్పలకొండ వద్ద వాపోయాడు. అంతలోనే.. హత్యకు గురికావడం ఆ కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ బెదిరింపులకు పాల్పడినవారే ఈ ఘాతుకానికి ఒడిగట్టారా? లేక మరేదైనా వివాదం ఉందా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుడి సోదరి అప్పలకొండ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్లతో ఘటనా స్థలాన్ని పరిశీలించి కీలక ఆధారాలు సేకరించారు. నిందితులను గుర్తించేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు. కష్టపడి బతికే మత్స్యకారుడి ప్రాణాలు గాల్లో కలసిపోవడంతో స్థానికంగా విషాదం నెలకొంది. చదవండి: భర్త ఫోన్ ఎత్తలేదని భార్య ఆత్మహత్య -
ప్రమాదం ముందే తెలుసు.. బయటపెట్టిన వాట్సాప్ స్టేటస్
-
రుషికొండ బీచ్‌లో విషాదం
కొమ్మాది (విశాఖ): మహాశివరాత్రి పర్వదినాన్ని ఆనందంగా గడపాలని సంద్రానికి వెళ్లిన స్నేహితులకు విషాదం మిగిలింది. అలల తాకిడికి కొట్టుకుపోయి బీటెక్ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. కొమ్మాది గాయత్రీ విద్యాపరిషత్ కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న ఐదుగురు విద్యార్థులు ఆదివారం రుషికొండ బీచ్‌కు చేరుకున్నారు. అక్కడ స్నానాలు ముగించుకుని రాడిసన్ బ్లూ వెనుక వైపు ఉన్న తీరానికి వెళ్లారు.అరవింద్ నాయుడు (21) మళ్లీ సముద్రంలోకి దిగగా, అలల ఉధృతికి ఒక్కసారిగా కొట్టుకుపోయాడు. అతడిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో స్నేహితుడు గోకులకృష్ణ ప్రమాదంలో చిక్కుకున్నాడు. గమనించిన లైఫ్ గార్డ్స్ బోటులో వెళ్లి గోకుల కృష్ణను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అపస్మారక స్థితిలో ఉన్న అరవింద్‌కు సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అరవింద్ మృతి చెందాడు. అరవింద్ స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి గ్రామం. అతని తండ్రి సూర్యప్రకాష్ ఫిర్యాదు మేరకు ఆరిలోవ పోలీసులు కేసునమోదు చేశారు. -
ఎసెన్షియా ప్రమాద బాధితులకు చంద్రబాబు పరామర్శ
-
18 మంది చనిపోతే పట్టించుకోని ప్రభుత్వం
-
ఒక తండ్రిలా ఆదుకున్నాడు వైఎస్ జగన్
-
విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదం ఘటనలో వెలుగులోకి కొత్త అంశాలు
-
ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదంపై వైవీ సుబ్బారెడ్డి రియాక్షన్
-
10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
బాధితులకు అండగా ఉండాలని సీఎం ఆదేశించారు: మంత్రి సీదిరి
-
విశాఖలో రోడ్డు ప్రమాదం: ఇద్దరి మృతి
విశాఖపట్టణం : విశాఖపట్టణం ఎన్ఏడి జంక్షన్లో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మట్టి లోడుతో వస్తున్న లారీ అదుపుతప్పి ఆగి ఉన్న ఆటోపై పడింది. దీంతో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. వెంటనే స్థానికులు క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టు మార్టం కోసం తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.


