మిసెస్‌ ఇండియా పోటీల్లో విశాఖ కెరటం | Visakhapatnam Women Select For Misses India 2019 Title | Sakshi
Sakshi News home page

మిసెస్‌ ఇండియా పోటీల్లో విశాఖ కెరటం

Feb 8 2019 7:25 AM | Updated on Feb 8 2019 7:25 AM

Visakhapatnam Women Select For Misses India 2019 Title - Sakshi

బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): ఇండియన్‌ ఫ్యాషన్‌ ఫియెస్టా పేరున జైపూర్‌లో నిర్వహించిన మిసెస్‌ ఇండియా– 2019 అందాల పోటీల్లో విశాఖ సోయగానికి న్యాయనిర్ణేతలు ఫిదా అయ్యారు. దాంతో నగర యువతి షాలిని రెండు సబ్‌టైటిల్స్‌ను గెలుచుకున్నారు. నగరానికి చెందిన షాలినీ బిస్త్, మిసెస్‌ ఇండియా అవుట్‌ స్టాండింగ్, సెనోరిటా అనే టైటిల్స్‌ దక్కించుకున్నారు. ఈమె గతంలో మిసెస్‌ వైజాగ్‌–2018 రన్నరప్‌గా నిలిచారు. షాలిని మల్కాపురంలోని సెయింట్‌ జోసెఫ్‌ సెకండరీ స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తూ ఉండడం విశేషం. ఈమె భర్త భారత నావికాదళంలో సేవలందిస్తున్నారు. పోటీలో పాల్గొనేందుకు తన కుటుంబ సభ్యులు ఎంతగానో ప్రోత్సహించారని షాలిని చెప్పారు. గతంలో హామ్స్‌షైర్‌ ఈవెంట్స్‌ నిర్వహించిన పోటీల్లో పాల్గొన్నప్పుడు కూడా వారి అండదండలు అద్భుతమని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement