గ్రామస్తుల ఎదురుదాడి.. పోలీసులకు తీవ్రగాయాలు | villagers attack police, injured cops rushed to bangalore | Sakshi
Sakshi News home page

గ్రామస్తుల ఎదురుదాడి.. పోలీసులకు తీవ్రగాయాలు

Mar 7 2014 12:39 PM | Updated on Aug 21 2018 5:46 PM

ఆంధ్రా - కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో పోలీసులకు ఎదురుదెబ్బ తగిలింది. గ్రామస్తులు పోలీసులపై ఎదురు దాడికి దిగారు.

ఆంధ్రా - కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో పోలీసులకు ఎదురుదెబ్బ తగిలింది. విలాజిర్లా గ్రామంలో మట్కా స్థావరాల మీద పోలీసులు దాడులు చేశారు. అయితే, పోలీసులు తక్కువ సంఖ్యలో ఉండటం, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఉండటంతో ఆ గ్రామస్తులు పోలీసులపై ఎదురు దాడికి దిగారు.

దీంతో అనంతపురం జిల్లాకు చెందిన ఏడుగురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. దాంతో గాయపడిన పోలీసులను బెంగళూరు ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.చిత్తూరు జిల్లాలో కూడా కొందరు స్మగ్లర్లు గతంలో పోలీసులు, అటవీ సిబ్బందిపై దాడి చేసిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement