యాచకుడి విరాళం రూ.లక్ష  | Vijayawada Beggar Donates One Lakh To Shirdi Temple | Sakshi
Sakshi News home page

యాచకుడి విరాళం రూ.లక్ష 

Jul 6 2018 2:34 AM | Updated on Jul 6 2018 2:34 AM

Vijayawada Beggar Donates One Lakh To Shirdi Temple - Sakshi

మధురానగర్‌ (విజయవాడ సెంట్రల్‌): విజయవా డ ముత్యాలంపాడులోని షిర్డీసాయిబాబా మంది రానికి ఓ యాచకుడు భా రీగా విరాళం ఇచ్చాడు. సాయిబాబా సమాధి చెంది వంద ఏళ్లు పూర్తవు తున్న సందర్బంగా షిర్డీ సాయిబాబా మందిరం లో ఈనెల 26వ తేదీన నిర్వహించ నున్న లక్ష నారికేళ జలాభిషేకంకు యాచకుడు యడ్ల యాది రెడ్డి రూ.1,08,000 విరాళంగా అందజేశాడు. మందిర గౌరవాధ్యక్షుడు గౌతంరెడ్డి మాట్లా డుతూ.. యాదిరెడ్డి ఇప్పటికే ఆలయంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి వెండి ఆభరణాలు చేయించటమే కాకుండా నిత్య అన్నదానానికి రూ.లక్ష విరాళం అందజేసినట్లు గుర్తు చేశారు. యాదిరెడ్డి మాట్లాడుతూ.. తనకు భక్తులు వేసిన ప్రతీ రూపాయిని భద్రపరచి.. దేవాలయంలో సేవలకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు విరాళంగా ఇస్తున్నట్టు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement