కోనసీమ తిరుపతిలో వైభవంగా దివ్యకల్యాణం | Vekateswara swamy Wedding in Konaseema tirupati | Sakshi
Sakshi News home page

కోనసీమ తిరుపతిలో వైభవంగా దివ్యకల్యాణం

Apr 16 2019 6:19 PM | Updated on Apr 16 2019 7:55 PM

Vekateswara swamy Wedding in Konaseema tirupati - Sakshi

రాజమండ్రి: కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురంలోని వాడపల్లి వెంకటేశ్వరస్వామి దివ్యకల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలతో వైభవంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రధానాలయం నుంచి పల్లకిపై కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. విశ్వక్సేన పూజ, రక్షాబంధనం, మధు పర్కప్రాసన, కన్యాధానం కార్యక్రమాలను వేద పండితులు శాస్ర్తోక్తంగా నిర్వహించారు.    

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement