తిరుపతి భక్తులకు గుడ్‌న్యూస్‌ | Nanded Tiruchaur Special Express will run as a weekly express | Sakshi
Sakshi News home page

తిరుపతి భక్తులకు గుడ్‌న్యూస్‌

May 2 2026 10:55 AM | Updated on May 2 2026 10:55 AM

Nanded Tiruchaur Special Express will run as a weekly express

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌: ఉమ్మడి జిల్లా నుంచి తిరుపతికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు మోసుకొచ్చింది. నాందేడ్‌– తిరుచానూరు (తిరుపతి) 0715/16 ఎక్స్‌ప్రెస్‌ను క్రమబద్ధీకరిస్తూ దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుక్రవారం ఆదేశాలు జారీ చేవారు. దీంతో ఈ రైలు సంఖ్య 17633/34తో మే 9వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది. దీంతో ప్రస్తుతం గురు, ఆదివారాల్లో మాత్రమే రైలు ద్వారా తిరుపతి వెళ్లే భక్తులకు అదనంగా మరో సర్వీసు అందుబాటులోకి వచ్చినట్లయింది.

 ఈ ప్రకటనపై ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్‌ భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం పెద్దపల్లి– కరీంనగర్‌– నిజా మాబాద్‌ సెక్షన్‌ నిర్వహణను సికింద్రాబాద్‌ డివిజన్‌ చూసుకుంది. ఇటీవల పలు డివిజన్ల పునర్వీవస్థీకరణలో భాగంగా పెద్దపల్లి– కరీంనగర్‌– నిజామాబాద్‌ సెక్షన్‌ను సికింద్రాబాద్‌ డివిజన్‌ నుంచి హైదరాబాద్‌ డివిజన్‌కు మారుస్తూ అధికారులు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 2017లో పూర్తయిన ఈ సెక్షన్‌ ఇకపై పూర్తిగా హైదరాబాద్‌ డివిజన్‌ పరిధిలోకి రానుంది.

రైలు రాకపోకలిలా
17633 నాందేడ్‌ నుంచి తిరుపతి(తిరుచానూరు) వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ పెద్దపల్లి జంక్షన్‌కు ప్రతి శనివారం రాత్రి 10 గంటలకు చేరుకుని, 10:15 నిమిషాలకు బయలుదేరుతుంది.

  • 17634 తిరుచానూరు (తిరుపతి)– నాందేడ్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ తిరుచానూరులో ప్రతి ఆదివారం సాయంత్రం 7:45 నిమిషాలకు బయల్దేరి పెద్దపల్లి జంక్షన్‌కు మరుసటి రోజు(సోమవారం) ఉదయం 8:50 నిమిషాలకు చేరుకుంటుంది. 9:15 నిమిషాలకు నాందేడ్‌ వైపు వెళ్తుంది. దీంతో బాసర వెళ్లే భక్తులకు కూడా ఉపయోగంగా ఉంటుంది.

  • ఈ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లో ఏసీ–1టైర్‌(1బోగి), ఏసీ–2టైర్‌(1 బోగి), ఏసీ–3టైర్‌(4 బోగీలు), ఆరు స్లీపర్‌ బోగీలు, నాలుగు సాధారణ బోగీలు, మొత్తానికి 16 బోగీలు ఉంటాయి.

  • తిరుపతి నుంచి వచ్చిన రామగుండం, మంచిర్యాల, మందమర్రి, రవీంద్రఖని, బెల్లంపల్లి, ఆసిఫాబాద్‌ రోడ్డు (రెబ్బెన), రేచినీ రోడ్డు (తాండూరు), సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ భక్తులు పెద్దపల్లి జంక్షన్‌లో ప్రతి సోమవారం 17634 తిరుచానూరు– నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ దిగిన వెంటనే 17011 హైదరాబాద్‌– సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కడానికి అవకాశముంటుంది. ప్రతి సోమవారం సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ నుంచి రామగుండం మధ్య గల స్టేషన్లలోని ప్రయాణికులు బాసర వెళ్లడానికి ఆస్కారం ఉంటుంది.

  • శనివారం రాత్రి 17634 నాందేడ్‌ నుంచి తిరుచానూ రు ఎక్స్‌ప్రెస్‌ ద్వారా బాసర నుంచి వచ్చే భక్తులు రా మగుండం, మంచిర్యాల, మందమర్రి, రవీంద్రఖని, బెల్లంపల్లి, ఆసిఫాబాద్‌ రోడ్డు, రేచిని రోడ్డు, సిర్పూర్‌ కాగజ్‌నగర్, సిర్పూర్‌ టౌన్‌ వెళ్లే వారికి పెద్దపల్లి జంక్షన్‌లో దిగిన తరువాత ఒక గంటన్నర తరువాత 17035 కాజీపేట– బల్లార్షా ఎక్స్‌ప్రెస్‌ అందుబాటులో ఉంటుంది, ఇది కనెక్టింగ్‌ రైలుగా ఉంటుంది. 

Advertisement
 
Advertisement
Advertisement