వాహనాలు దొంగతనం చేసే.. నలుగురు సభ్యుల దొంగల ముఠాను వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల పోలీసులు సోమవారం పట్టుకున్నారు.
వాహనాలు దొంగతనం చేసే.. నలుగురు సభ్యుల దొంగల ముఠాను వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల పోలీసులు సోమవారం పట్టుకున్నారు. వారి నుంచి రూ.10 లక్షల విలువైన ట్రాక్టర్ ఇంజిన్, ట్యాంకర్లు, ట్రాలీలను స్వాధీనం చేసుకున్నారు. వైఎస్సార్ జిల్లా కలమల, వల్లూరు, కమలాపురం, కాజీపేట ప్రాంతాలకు చెందిన నలుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి ట్రాక్టర్లతోపాటు ట్రాలీలు, నీటి ట్యాంకర్లను ఎత్తుకుపోతున్నారు.
బాధితుల ఫిర్యాదు మేరకు నిఘా పెట్టిన పోలీసులు మండలంలోని కలమలపూడిలో ఉంచిన మూడు నీటి ట్యాంకర్లు, ఆరు ట్రాక్టర్ ట్రాలీలతోపాటు ఒక ట్రాక్టర్ ఇంజిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వాటిని దొంగతనంగా తీసుకు వచ్చిన నలుగురిని అదుపులోకి తీసుకుని సోమవారం రిమాండ్‌కు పంపినట్లు సీఐ రాజేంద్రప్రసాద్, కలమల ఎస్సై హేమాద్రి తెలిపారు.