' బీసీలకు ద్రోహం చేస్తున్న బాబు, కృష్ణయ్య ' | Uday kiran takes on chandrababu and r krishnaiah | Sakshi
Sakshi News home page

' బీసీలకు ద్రోహం చేస్తున్న బాబు, కృష్ణయ్య '

Dec 29 2014 4:51 PM | Updated on Mar 28 2019 5:23 PM

' బీసీలకు ద్రోహం చేస్తున్న బాబు, కృష్ణయ్య ' - Sakshi

' బీసీలకు ద్రోహం చేస్తున్న బాబు, కృష్ణయ్య '

సీఎం చంద్రబాబు, ఆర్.కృష్ణయ్యలు బీసీలకు ద్రోహం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.ఉదయకిరణ్ ఆరోపించారు.

అనంతపురం: సీఎం చంద్రబాబు, ఆర్.కృష్ణయ్యలు బీసీలకు ద్రోహం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.ఉదయకిరణ్ ఆరోపించారు. సోమవారం అనంతపురంలో ఉదయకిరణ్ మాట్లాడుతూ... ఎన్నికల ముందు చంద్రబాబు బీసీలకు వరాలిచ్చి.. సీఎం అయి ఆరు నెలలైనా ఒక్కటీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు.

వాల్మీకులను ఎస్టీ కులాల జాబితాలో ఎందుకు చేర్చలేదని చంద్రబాబును ప్రశ్నించారు. అలాగే కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు అడ్డంకిగా మారిన 101 జీవోను రద్దు చేయాలని ప్రభుత్వానికి ఉదయకిరణ్ విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement