యువకుడి హత్య - మరో వ్యక్తిని తగులబెట్టారు | Two murders | Sakshi
Sakshi News home page

యువకుడి హత్య-మరో వ్యక్తిని తగులబెట్టారు

Jul 20 2014 9:10 AM | Updated on Jul 30 2018 9:21 PM

ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ జిల్లా, ప్రకాశం జిల్లాలలో రెండు హత్యలు జరిగాయి.

కడప: ఆంధ్రప్రదేశ్లోని  వైఎస్ఆర్ జిల్లా, ప్రకాశం జిల్లాలలో రెండు హత్యలు జరిగాయి. ఒక యువకుడి గొంతు కోసి దారుణంగా హత్య చేయగా, మరో ఘటనలో ఒక వ్యక్తిని హత్య చేసి తగులబెట్టారు.  వైఎస్ఆర్ జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలో కొందరు దుండగులు ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. దొడ్ల డైయిరీ సమీపంలో ఈ  హత్య జరిగింది. కొందరు దుండగులు యువకుడి గొంతును కత్తితో  కోసేశారు. దాంతో యువకుడు దుర్మరణం చెందాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు.

ప్రకాశం జిల్లా చీరాల సమీపంలో ఈపురుపాలెం స్ట్రైట్‌కట్‌ వద్ద మరో హత్య జరిగింది. కొందరు దుండగులు ఒక  వ్యక్తిని చంపేసి, ఆ తరువాత  తగులపెట్టారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి విచారణ మొదలు పెట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement