పైకప్పు కూలి ఇద్దరి మృతి | Two killed in roof collapse | Sakshi
Sakshi News home page

పైకప్పు కూలి ఇద్దరి మృతి

Feb 1 2015 11:38 AM | Updated on Aug 25 2018 5:41 PM

విజయవాడ నగరంలో ఇంటి పైకప్పు కూలి ఇద్దరు కూలీలు మృతిచెందిన సంఘటన ఆదివారం జరిగింది.

విజయవాడ (విద్యాధరపురం): విజయవాడ నగరంలో ఇంటి పైకప్పు కూలి ఇద్దరు కూలీలు మృతిచెందిన సంఘటన ఆదివారం జరిగింది. ఈ సంఘటన విజయవాడ నగరంలోని విద్యాధరపురం కాలనీలోని కొండ ప్రాంతంలో పాత భవనం మరమ్మతులు నిర్వహిస్తుండగా సంభవించింది. భవన నిర్మాణంలో భాగంగా పాత కప్పును తీసివేసే సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

భవనం పైభాగం నుంచి దిమ్మిసతో కొడుతున్న సమయంలో కింది భాగంలో పనిచేస్తున్న ఇద్దరు కూలీలపై స్లాబ్ ఒక్కసారిగా పడటంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు. భవనం పైభాగంలో ఉన్న వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. మృతులు ఎవరెవరు అనేది ఇంకా తెలియరాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement