రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి | Two killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

Feb 24 2016 2:03 PM | Updated on Aug 30 2018 3:58 PM

అచ్చంపేట మండల కేంద్రంలోని గురుకుల పాఠశాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

అచ్చంపేట మండల కేంద్రంలోని గురుకుల పాఠశాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బైక్‌పై గంగమ్మపల్లి తిరునాళకు వెళ్లి తిరిగి వస్తుండగా లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అత్త లింగమ్మ(45), అల్లుడు గోపి(24) మృతిచెందగా.. గోపి భార్య అనూషకు తీవ్రగాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అనూషను సత్తెనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరంతా బెల్లంకొండ మండలం వన్నాయిపాలెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement