బైక్ - కారు ఢీ: ఇద్దరు మృతి | Two killed in road accident | Sakshi
Sakshi News home page

బైక్ - కారు ఢీ: ఇద్దరు మృతి

Jan 1 2016 11:08 AM | Updated on Aug 30 2018 3:56 PM

పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం గోరింతోట గ్రామంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం గోరింతోట గ్రామంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ - కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అలాగే మృతదేహాలను స్వాధీనం చేసుకుని... పోస్ట్మార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement