ఆన్‌లైన్‌లో శ్రీవారి ఆర్జిత సేవల టికెట్లు | TTD Releases Srivari Arjitha Seva Tickets In Online | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో శ్రీవారి ఆర్జిత సేవల టికెట్లు

Jul 5 2019 10:14 AM | Updated on Jul 5 2019 10:15 AM

TTD Releases Srivari Arjitha Seva Tickets In Online - Sakshi

సాక్షి, తిరుపతి : 2019 అక్టోబరు నెల శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదలయ్యాయి. అక్టోబర్‌ నెలకు సంబంధించి మొత్తం 55,355 శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లను ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఆన్‌లైన్‌ డిప్‌ విధానంలో 9,305 టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి.  ఇందులో సుప్రభాతం 7,180, తోమాల 110, అర్చన 110, అష్టదళ పాద పద్మారాధన 180, నిజపాద దర్శనం 1,725 టికెట్లు ఉన్నాయి. ఆన్‌లైన్‌ జనరల్‌ కేటగిరిలో 46,050 సేవాటికెట్లు ఉండగా వీటిలో విశేషపూజ 1500, కల్యాణం 10,450, ఊంజల్‌ సేవ 3,300, ఆర్జిత బ్రహ్మూత్సవం 6,050, వసంతోత్సవం11,550, సహస్ర దీపాలంకార సేవ 13,200 టికెట్లు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement