శ్రీవారి దర్శన ఆన్‌లైన్ టిక్కెట్లు 30వేలకు పెంపు | ttd online darshan tickets | Sakshi
Sakshi News home page

శ్రీవారి దర్శన ఆన్‌లైన్ టిక్కెట్లు 30వేలకు పెంపు

May 1 2015 8:34 PM | Updated on Sep 3 2017 1:14 AM

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శన ఆన్‌లైన్ టిక్కెట్ల సంఖ్యను మరింత పెంచనున్నట్లు టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు.

తిరుమల : తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శన ఆన్‌లైన్ టిక్కెట్ల సంఖ్యను మరింత పెంచనున్నట్లు టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు. శుక్రవారం ఆయన తిరుమలలో విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం రోజూ రూ.300కు ఆన్‌లైన్ టిక్కెట్లు, రూ.50కు సుదర్శనం టిక్కెట్లు 25వేల దాకా ఇస్తున్నామన్నారు.

 

భక్తులు నిర్దేశించిన సమయంలోనే వస్తుండడంతో రెండు గంటల్లోనే దర్శనం లభిస్తోందని తెలిపారు. దీనివల్ల మిగిలిన దర్శనాలు కూడా సక్రమంగా అమలయ్యే అవకాశం ఏర్పడిందన్నారు. త్వరలోనే ఈ సంఖ్యను సుమారు 30వేలకు పెంచనున్నట్లు చెప్పారు. వేసవి రద్దీకి అనుగుణంగా ఆరు లక్షల లడ్డూలు సిద్ధం చేశామన్నారు. అన్ని కంపార్ట్‌మెంట్లలోనూ లడ్డూ టోకెన్లు ఇస్తామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement