విష్వక్సేనుడి సాక్షిగా ‘ఫన్ డే’ ఆవిష్కరణ | TTD appreciated the sakshi funday | Sakshi
Sakshi News home page

విష్వక్సేనుడి సాక్షిగా ‘ఫన్ డే’ ఆవిష్కరణ

Oct 3 2016 3:12 AM | Updated on Sep 4 2017 3:55 PM

విష్వక్సేనుడి సాక్షిగా ‘ఫన్ డే’ ఆవిష్కరణ

విష్వక్సేనుడి సాక్షిగా ‘ఫన్ డే’ ఆవిష్కరణ

‘విశ్వపతికి బ్రహ్మాండసేవ’ శీర్షికతో సాక్షి ‘ఫన్ డే’ సంచికను విష్వక్సేనుడి ఊరేగింపులో ఆవిష్కరించారు.

- బ్రహ్మోత్సవాల ఆరో ప్రత్యేక సంచికకు టీటీడీ ప్రశంసలు
- సాక్షి యాజమాన్యం, ఫన్ డే బృందానికి ప్రత్యేక అభినందనలు

 సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక కథనాలతో ‘విశ్వపతికి బ్రహ్మాండసేవ’  శీర్షికన ప్రచురితమైన సాక్షి ‘ఫన్ డే’ సంచికను ఆదివారం రాత్రి విష్వక్సేనుడి ఊరేగింపులో ఆవిష్కరించారు. టీటీడీ చైర్మన్ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు, సీవీఎస్‌వో శ్రీనివాసరావు, డిప్యూటీ ఈవో కోదండ రామారావు, పేష్కార్ సెల్వం, బోర్డు సభ్యులు భానుప్రకాష్‌రెడ్డి, రమణ, అర్చకులు ‘సాక్షి ఫన్ డే’ సంచికను ఆవిష్కరించారు. బ్రహ్మోత్సవాల్లో వరుసగా ఆరో ప్రత్యేక సంచిక తీసుకొచ్చిన ఘనత సాక్షి యాజమాన్యానికే దక్కిందని కొనియాడారు.

శ్రీవారి వైభవ విశేషాలు,  కైంకర్యాలు, చారిత్రక నేపథ్యం, వేయేళ్ల రామానుజుడు, మహంతుల కాలంతోపాటు కదిలొచ్చిన మార్పులు, ఆభరణాల ఆనంద నిలయుడు, తరతరాల సంప్రదాయం, కనువిందు చేసే అరుదైన ఫొటోలు.. వంటి ఆసక్తికర అంశాలతో వెలువడిన ‘ఫన్ డే’లో విశ్లేషణాత్మక కథనాలు రాసిన సాక్షి సీనియర్ స్టాఫ్ రిపోర్టర్ సహదేవ కేతారితోపాటు ఫన్‌డే బృందాన్ని ప్రశంసించారు. తిరుమల చారిత్రక అంశాలు, విశేషాలు, ఉత్సవాల వైభవాన్ని ‘సాక్షి ఫన్ డే’ ద్వారా తెలి యజేయటంలో సాక్షి యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ తీసుకుందని కొనియాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement