భారీ వర్షాలతో పలు రైళ్ల రద్దు | trains cancelled due to heavy rains | Sakshi
Sakshi News home page

భారీ వర్షాలతో పలు రైళ్ల రద్దు

Oct 28 2013 8:41 AM | Updated on Sep 2 2017 12:04 AM

భారీ వర్షాల కారణంగా రైల్వే ట్రాక్ మీదకు నీళ్లు రావడంతో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

భారీ వర్షాల కారణంగా రైల్వే ట్రాక్ మీదకు నీళ్లు రావడంతో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సోమవారం నాడు బయల్దేరాల్సిన ఈ రైళ్ల సర్వీసులను రద్దుచేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రధాన పౌర సంబంధాల అధికారి కె.సాంబశివరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి...

చెన్నైలో ఉదయం 8.45 గంటలకు బయల్దేరాల్సిన నెం. 12842 చెన్నై- హౌరా కోరమాండల్ ఎక్స్ప్రెస్ రద్దయింది.

చెన్నైలో రాత్రి 9.40 గంటలకు బయల్దేరాల్సిన నెం. 12840 చెన్నై- హౌరా మెయిల్ రద్దయింది.

తిరుపతిలో రాత్రి 7.55కు బయల్దేరాల్సిన తిరుపతి - కోల్కతా సంత్రాగచి ఎక్స్ప్రెస్ రద్దయింది.

కోల్కతా షాలిమార్లో ఉదయం 11 గంటలకు బయల్దేరాల్సిన కోల్కతా షాలిమార్ - యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్ రద్దయింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement