ఏటీఎంలో చోరీకి యత్నం | thieves attack on atm in perur | Sakshi
Sakshi News home page

ఏటీఎంలో చోరీకి యత్నం

Jul 2 2015 9:41 AM | Updated on Aug 28 2018 7:30 PM

దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు.

పేరూరు (అనంతపురం): దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఏకంగా ఏటీఎం చోరీకి పాల్పడ్డారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా రామగిరి మండలం పేరూరు గ్రామంలో గురువారం తెల్లవారు జామున జరిగింది. గుర్తు తెలియని దుండగులు బుధవారం అర్ధరాత్రి దాటాక గ్రామంలోని ఆంధ్రప్రగతి బ్యాంక్ ఏటీఎం ధ్వంసం చేసి చోరీకి యత్నించారు.

అయితే.. స్థానికులు పసిగట్టడంతో అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న రామగిరి పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎవరినీ బ్యాంకు వద్దకు అనుమతించకపోవటంతో ఎంత చోరీ జరిగిందనే విషయం తెలియరాలేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement