తాళం వేసిన ఇంటిని ఊడ్చుకెళ్లారు.. | Theft in Visakhapatnam | Sakshi
Sakshi News home page

తాళం వేసిన ఇంటిని ఊడ్చుకెళ్లారు..

Mar 8 2016 9:01 AM | Updated on May 3 2018 3:17 PM

తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి ఉన్నందంతా ఊడ్చుకెళ్లారు.

తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి ఉన్నందంతా ఊడ్చుకెళ్లారు. ఈ సంఘటన విశాఖజిల్లా నక్కపల్లిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న కె. సత్యనారాయణ ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి ఊరెళ్లి మంగళవారం ఉదయం తిరిగి వచ్చారు. అప్పటికే తలుపులు తీసి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రాథమిక విచారణ జరిపి ఇంట్లో ఉన్న 21 తులాల బంగారు నగలతో పాటు రూ. 10 వేల నగదు ఎత్తుకెళ్లినట్లు తేల్చారు. ఇది పాత నేరస్థుల పనే అని అనుమానిస్తున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement