రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి | The person killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Apr 4 2016 11:54 AM | Updated on Aug 30 2018 4:07 PM

వేగంగా వెళ్తున్న టిప్పర్ ముందు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు.

వేగంగా వెళ్తున్న టిప్పర్ ముందు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదం కృష్ణాజిల్లా అవనిగడ్డ కోర్టు సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న దాసి సురేంద్ర(28) పెయింటర్‌గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

 

ఈ క్రమంలో బైక్‌పై పనికి వెళ్తుండగా.. వెనుక నుంచి వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. దీంతో సురేంద్ర అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనకు కారణమైన టిప్పర్ డ్రైవర్ కనీసం వాహనాన్ని అక్కడ ఆపకుండా వెళ్లిపోవడంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు తమ రక్షక్ వాహనాన్ని రోడ్డుకు అడ్డంగా పెట్టి టిప్పర్ ఆపి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement