అగ్ని ప్రమాదం - మూడిళ్లు దగ్ధం | The fire burned three homes | Sakshi
Sakshi News home page

అగ్ని ప్రమాదం - మూడిళ్లు దగ్ధం

Sep 22 2015 12:46 PM | Updated on Sep 5 2018 9:45 PM

తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం పండ్రవాడ గ్రామంలో మంగళవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో మూడిళ్లు దగ్ధం అయ్యాయి.

తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం పండ్రవాడ గ్రామంలో మంగళవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో మూడిళ్లు దగ్ధం అయ్యాయి. వెంకటరమణ అనే వ్యక్తికి చెందిన పూరింట్లో వంట చేస్తున్న సమయంలో నిప్పు అంటుకుని మంటలు లేచాయి. అవి పక్కనే ఉన్న పార్వతి, వెంకన్న నివాసాలకు వ్యాపించడంతో మొత్తం మూడిళ్లూ దగ్ధం అయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు మరింత వ్యాపించకుండా ఆర్పివేశారు. కాగా, ఈ ప్రమాదంలో రూ.4 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని సమాచారం.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement