కుటుంబ కలహాలతో దంపతుల ఆత్మహత్య | The couple committed suicide | Sakshi
Sakshi News home page

కుటుంబ కలహాలతో దంపతుల ఆత్మహత్య

Mar 7 2016 2:33 PM | Updated on Nov 6 2018 7:56 PM

తూర్పుగోదావరి జిల్లా తుని మండలం చామవరంలో సోమవారం ఉదయం కుటుంబ కలహాలతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.

తూర్పుగోదావరి జిల్లా తుని మండలం చామవరంలో సోమవారం ఉదయం కుటుంబ కలహాలతో దంపతులు ప్రాణాలు తీసింది. గ్రామానికి చెందిన మేడిశెట్టి సుబ్బారావు(40), వెంకటలక్ష్మి(35) సోమవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నారు. వెంకటలక్ష్మి ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకోగా, సుబ్బారావు పురుగుల మందు తాగి సమీపంలోని పంట కాలువ వద్ద మృతిచెందాడు.

సుబాఆబరావు తాపీ మేస్త్రీగా పనిచేసేవాడు. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. ఇరుగుపొరుగువారి ఫిర్యాదు మేరకు తుని పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement