పిఠాపురంలో అధికారుల సర్వే.. ఉద్రిక్తత | tension at pithapuram over cmc hospitals land survey | Sakshi
Sakshi News home page

పిఠాపురంలో అధికారుల సర్వే.. ఉద్రిక్తత

Nov 3 2015 3:16 PM | Updated on Sep 3 2017 11:57 AM

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

పిఠాపురం: తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీఎంసీ ఆస్పత్రికి చెందిన భూముల్లో రెవెన్యూ అధికారులు మంగళవారం సర్వే చేసేందుకు పోలీసు బందోబస్తుతో రంగంలోకి దిగారు.

ఆస్పత్రి భూముల్లో పోరంబోకు భూములు ఉన్నాయన్న అనుమానంతో అధికారులు సర్వేకు వచ్చారు. సర్వే చేయడానికి వీలులేదని ఆస్పత్రి సిబ్బంది భీష్మించుకు కూర్చున్నారు.ఈ ఘర్షణలో ఒక నర్సుకు తీవ్ర గాయాలయ్యాయి. ఇరువర్గాల వాదోపవాదాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement