టీడీపీ నేత మోసం.. ఉద్యోగం ఇప్పిస్తానని.. | TDP MPTC Cheats Woman Over Anganwadi Job Offer | Sakshi
Sakshi News home page

టీడీపీ నేత మోసం.. ఉద్యోగం ఇప్పిస్తానని..

Oct 7 2018 4:58 PM | Updated on Oct 8 2018 11:03 AM

TDP MPTC Cheats Woman Over Anganwadi Job Offer - Sakshi

సాక్షి, విశాఖపట్నం : టీడీపీ నేతల ఆగడాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. అధికార పార్టీ అండచూసుకుని కొందరు నేతలు మోసాలకు పాల్పడుతున్నారు. విశాఖపట్నానికి చెందిన ఓ మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ టీడీపీ ఎంపీటీసీ ఆమె వద్దనుంచి లక్షలు కాచేశాడు. దీంతో మనస్తాపం చెందిన ఆ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి మండలం ఎ.కొత్తపల్లికి చెందిన ఎంపీటీసీ పెద్దాడ వెంకటరమణ అంగన్‌వాడీ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి సంతోష కుమారి అనే మహిళ దగ్గర 4లక్షలు వసూలు చేశాడు.

డబ్బుతీసుకుని ఉద్యోగం ఇప్పించకపోగా తన బంధువుల మహిళకు ఇప్పించాడు. దీంతో బాధితురాలు మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. సంతోష కుమారి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు.  

Advertisement
 
Advertisement
Advertisement