మచిలీపట్నంలో టీడీపీ నాయకుల దాష్టీకం | TDP Leaders Attack On Grama Volunteers In Machilipatnam | Sakshi
Sakshi News home page

వాలంటీర్లపై దాడికి తెగబడ్డ టీడీపీ నాయకులు

Mar 7 2020 6:40 PM | Updated on Mar 7 2020 7:06 PM

TDP Leaders Attack On Grama Volunteers In Machilipatnam - Sakshi

సాక్షి, కృష్ణా : మచిలీపట్నంలో టీడీపీ నాయకులు దాష్టీకానికి తెగబడ్డారు. 9వ వార్డు సచివాలయంలో పనిచేస్తున్న వాలంటీర్లపై దాడికి దిగారు.  సచివాలయం ఇక్కడ ఉండటానికి వీలు లేదని నినాదాలు చేస్తూ ఆడవారిపై దాడి చేశారు. ‘కులం తక్కువ దానివి. నువ్వేంటే మాకు చెప్పేది’ అంటూ భారతి అనే 4 నెలల గర్భిణీపై పాక్షికంగా దాడి చేశారు. అదే విధంగా రేషన్‌ కార్డులు పంపిణీ చేస్తుంటే ఓటర్‌ కార్డులు మీ చేతిలో ఉండటం ఏంటి.. అని వాలంటీర్లతో టీడీపీ నేతలు గొడవకు దిగారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement