గుడిపాలలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై దాడి | TDP activists attack YSRCP workers in chittoor district | Sakshi
Sakshi News home page

గుడిపాలలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై దాడి

Jul 26 2014 2:44 PM | Updated on Aug 10 2018 8:35 PM

అధికారం తమ చేతిలో ఉందనే అహంతో తెలుగుదేశం పార్టీ ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా ....

చిత్తూరు : అధికారం తమ చేతిలో ఉందనే అహంతో తెలుగుదేశం పార్టీ ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా గుడిపాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై శనివారం టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆరుగురు వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మరోవైపు గుంటూరు జిల్లా బాపట్లలో రుణమాఫీపై ఆందోళనకు దిగిన వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలతో టీడీపీ శ్రేణులు వాగ్వివాదానికి దిగారు. చివరకు పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది.

 

Advertisement
 
Advertisement
Advertisement