జగన్ సమైక్య దీక్షకు పెరుగుతున్న మద్దతు | Support increase day by day to Jagan Samaikya Deeksha | Sakshi
Sakshi News home page

జగన్ సమైక్య దీక్షకు పెరుగుతున్న మద్దతు

Oct 7 2013 3:32 PM | Updated on Aug 8 2018 5:45 PM

జగన్ సమైక్య దీక్షకు పెరుగుతున్న మద్దతు - Sakshi

జగన్ సమైక్య దీక్షకు పెరుగుతున్న మద్దతు

రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, లోక్సభ సభ్యుడు జగన్మోహన రెడ్డి చేస్తున్న 'సమైక్య దీక్ష'కు మద్దతు రోజురోకు పెరుగుతోంది.

హైదరాబాద్: రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని కోరుతూ  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, లోక్సభ సభ్యుడు జగన్మోహన రెడ్డి చేస్తున్న  'సమైక్య దీక్ష'కు మద్దతు రోజురోజుకు పెరుగుతోంది.  రాష్ట్రం నలుమూలల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. హైదరాబాద్లో తన క్యాంపు కార్యాలయం ఎదుట జగన్ చేపట్టిన ఆమరణదీక్ష మూడవ రోజుకు చేరింది. రాష్ట్రం నలుమూలల నుంచి  అభిమానులు, కార్యకర్తలు  శిబిరం వద్దకు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు.  దీక్షకు మద్దతు తెలుపుతూ మహిళలు కూడా అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈ రోజు ఐటి ఉద్యోగులు శిబిరం వద్దకు వచ్చి జగన్ దీక్షకు మద్దతు తెలిపారు. సమైక్యత కోసం నిజాయితీగా పోరాడే ఏకైక రాజకీయ నేతగా జగన్ నిలిచారు. సమైక్యవాదులకు అండగా దీక్ష చేపట్టారు.

 జగన్ సమైక్య దీక్షకు మద్దతుగా వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు సీమాంధ్ర అంతటా దీక్షలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు నిరసనగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  జగన్ దీక్షకు రాష్టవ్యాప్తంగా సమైక్యవాదులు మద్దతు తెలుపుతున్నారు.

విజయవాడలో వంగవీటి రాధ జగన్ దీక్షకు మద్దతుగా దీక్ష చేస్తున్నారు. జగన్కు మద్దతుగా ఎన్నిరోజులైనా దీక్ష చేస్తానని  రాధ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement