కేంద్ర మంత్రి కృపారాణి కార్యాలయం ముట్టడి | Students protests at minister kill kruparani camp office in srikakulam | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రి కృపారాణి కార్యాలయం ముట్టడి

Oct 8 2013 11:18 AM | Updated on Sep 27 2018 5:59 PM

కేంద్ర మంత్రి కృపారాణి కార్యాలయం ముట్టడి - Sakshi

కేంద్ర మంత్రి కృపారాణి కార్యాలయం ముట్టడి

రాష్ట్ర విభజనను నిరసిస్తూ కేంద్రమంత్రి, శ్రీకాకుళం లోక్సభ సభ్యురాలు కిల్లి కృపారాణి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

రాష్ట్ర విభజనను నిరసిస్తూ కేంద్రమంత్రి, శ్రీకాకుళం లోక్సభ సభ్యురాలు కిల్లి కృపారాణి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. మంగళవారం శ్రీకాకుళంలోని మంత్రి కిల్లి క్యాంప్ కార్యాలయాన్ని విద్యార్థులు ముట్టడించారు. సీమాంధ్రలో సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతోన్న కిల్లి కృపారాణి రాజీనామా చేయకపోవడంపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు.

 

అయితే మంత్రి క్యాంప్ కార్యాలయాన్ని విద్యార్థులు ముట్టడించారన్న సమాచారంతో అందుకున్న ఉన్నతాధికారులు భారీగా పోలీసులను మోహరించారు. అనంతరం విద్యార్థులను అక్కడి నుంచి పంపే ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల ప్రయత్నాన్ని విద్యార్థులు అడ్డుకున్నారు. దాంతో కొద్ది పాటి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement