స్కూల్ ఆటో బోల్తా : విద్యార్థి మృతి | Student dies in Road accident | Sakshi
Sakshi News home page

స్కూల్ ఆటో బోల్తా : విద్యార్థి మృతి

Jun 29 2015 5:41 PM | Updated on Nov 9 2018 4:36 PM

విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటో బోల్తా కొట్టిన ఘటనలో ఓ విద్యార్థి ప్రాణాలొదిలాడు.

కర్నూలు (కోడుమూరు) : విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటో బోల్తా కొట్టిన ఘటనలో ఓ విద్యార్థి ప్రాణాలొదిలాడు.  కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలో సోమవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కోడుమూరు మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు ఆటోలో ఇంటికి తిరిగి వెళుతుండగా అదుపు తప్పి బోల్తా కొట్టింది.

ఈ ప్రమాదంలో ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థి నరేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిని విద్యార్థులను  స్థానిక ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement