బైక్, టిప్పర్ ఢీ: విద్యార్థి మృతి | student died in bike - tipper collisioned | Sakshi
Sakshi News home page

బైక్, టిప్పర్ ఢీ: విద్యార్థి మృతి

Aug 22 2015 10:30 PM | Updated on Nov 9 2018 4:36 PM

బైక్‌ను టిప్పర్ ఢీకొట్టడంతో ఓ విద్యార్థి దుర్మరణం చెందాడు.

విజయవాడ(ఇంద్రకీలాద్రి): బైక్‌ను టిప్పర్ ఢీకొట్టడంతో ఓ విద్యార్థి దుర్మరణం చెందాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా విజయవాడలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. నగరంలోని కొత్తపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని మైలవరం ఫ్లై ఓవర్‌పై ద్విచక్ర వాహనంపై వెళుతున్న విద్యార్థిని టిప్పర్ ఢీకొట్టింది. దీంతో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు పీతల దుర్గారావు(18) నగరంలోని వైఎస్సార్ కాలనీకి చెందిన వ్యక్తిగా పోలీసులు నిర్ధరించారు.

Advertisement
 
Advertisement
Advertisement