వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు | Special Trains To Tirupati, Secunderabad | Sakshi
Sakshi News home page

వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు

Jun 29 2018 9:24 AM | Updated on Jun 29 2018 9:26 AM

Special Trains To Tirupati, Secunderabad - Sakshi

రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు విజయవాడ రైల్వే డివిజన్‌ ఇన్‌చార్జి పీఆర్వో జేవీ ఆర్కే రాజశేఖర్‌ గురువారం తెలిపారు. సికింద్రాబాద్‌–విజయవాడ ప్రత్యేక రైలు (07757) ఆగస్టు 5, 12, 19, 26వ తేదీల్లో, సెప్టెంబర్‌ 2, 9, 16, 23, 30వ తేదీల్లో, అక్టోబర్‌ 7, 14, 21, 28వ తేదీల్లో ఉదయం 5.30 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. విజయవాడ–సికింద్రాబాద్‌ రైలు (07758) ఆగస్ట్‌ 5, 12, 19, 26వ తేదీల్లో, సెప్టెంబర్‌ 2, 9, 16, 23, 30వ తేదీల్లో, అక్టోబర్‌ 7, 14, 21, 28వ తేదీల్లో విజయవాడలో సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరుతుంది.

తిరుపతి–కాకినాడ ప్రత్యేక రైలు (07942) ఆగస్టు 5, 12, 19, 26వ తేదీల్లో, సెప్టెంబర్‌ 2, 9, 16, 23, 30వ తేదీల్లో, అక్టోబర్‌ 7, 14, 21 ,28వ తేదీల్లో తిరుపతిలో సాయంత్రం బయలుదేరుతుంది. కాకినాడటౌన్‌–రేణిగుంట ప్రత్యేక రైలు (07941) ఆగస్టు 6, 13, 20, 27వ తేదీల్లో, సెప్టెంబర్‌ 3, 10, 17, 24వ తేదీల్లో, అక్టోబర్‌ 1, 8, 15, 22, 29వ తేదీల్లో సాయంత్రం 7.00 గంటలకు కాకినాడ టౌన్‌లో బయలుదేరుతుంది. నాందేడ్‌ –తిరుపతి ప్రత్యేక రైలు (07607) ఆగస్టు 7, 14, 21, 28వ తేదీల్లో, సెప్టెంబర్‌ 4, 11, 18, 25వ తేదీల్లో, అక్టోబర్‌ 2, 9, 16, 23, 30వ తేదీల్లో సాయంత్రం 6.45కు నాందేడ్‌లో బయలుదేరుతుంది. 

Advertisement
 
Advertisement
Advertisement