పండుగకు ప్రత్యేక రైళ్లు | special trains announced for pongal season | Sakshi
Sakshi News home page

పండుగకు ప్రత్యేక రైళ్లు

Jan 11 2017 6:40 AM | Updated on Sep 5 2017 12:55 AM

పండుగకు ప్రత్యేక రైళ్లు

పండుగకు ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి పండుగ దృష్ట్యా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే విశాఖ, తిరుపతి, కాకినాడలకు ఏడు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు సీపీఆర్‌వో ప్రకటించారు.

సంక్రాంతి పండుగ దృష్ట్యా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే విశాఖ, తిరుపతి, కాకినాడలకు ఏడు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు సీపీఆర్‌వో ప్రకటించారు. హైదరాబాద్‌-విశాఖపట్నం, సికింద్రాబాద్‌-కాకినాడ పోర్టు, కాకినాడ పోర్టు-తిరుపతి, హైదరాబాద్‌-తిరుపతిలకు ఈ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామన్నారు. 
 
 
ఈనెల 11న రైలు నెం.07449 సికింద్రాబాద్‌-కాకినాడ పోర్టు(వయా భీమవరం), హైదరాబాద్‌-తిరుపతి-హైదరాబాద్‌(02764, 02763) సర్వీసులు ఈనెల 13,14 తేదీల్లోను, హైదరాబాద్‌-విశాఖ-హైదరాబాద్‌(07148, 07147) సర్వీసులు ఈనెల 15,16 తేదీల్లో, కాకినాడ పోర్టు-తిరుపతి-కాకినాడ పోర్టులకు(07941, 07942) సర్వీసులను ఈనెల 12,13 తేదీల్లో నడుపుతారు. మధురై-విజయవాడల మధ్య కూడా రెండు రైళ్లను నడుపతున్నట్లు ఆయన తెలిపారు. మధురై-విజయవాడ(06069) రైలును ఈనెల 14న, విజయవాడ-మధురై రైలును 16న నడిపేందుకు ఏర్పాట్లు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement