స్పీకర్, సీఎం ఉగాది శుభాకాంక్షలు | Speaker kodela and CM chandrababu says Ugadi greetings to the public | Sakshi
Sakshi News home page

స్పీకర్, సీఎం ఉగాది శుభాకాంక్షలు

Mar 29 2017 2:39 AM | Updated on Jul 29 2019 2:44 PM

రాష్ట్ర ప్రజలకు స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం శాసనసభలో ఆయన మాట్లాడుతూ..

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. కొత్త సంవత్సరంలో ప్రజలందరికీ మేలు జరగాలని కోరుకుంటున్నానని చెప్పారు. సీఎం చంద్రబాబు శాసనసభలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. షడ్రుచులతో చేసిన ఉగాది పచ్చడిలోనూ సందేశం ఉందన్నారు.

ఆ స్ఫూర్తితో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఓ ప్రకటనలో ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement