'తెలంగాణకు స్వేచ్చ, స్వతంత్రం ఇచ్చింది సోనియానే' | Sonia Gandhi has given liberty, Independence to Telangana, says Muniyappa | Sakshi
Sakshi News home page

'తెలంగాణకు స్వేచ్చ, స్వతంత్రం ఇచ్చింది సోనియానే'

Apr 27 2014 12:19 PM | Updated on Oct 22 2018 9:16 PM

'తెలంగాణకు స్వేచ్చ, స్వతంత్రం ఇచ్చింది సోనియానే' - Sakshi

'తెలంగాణకు స్వేచ్చ, స్వతంత్రం ఇచ్చింది సోనియానే'

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీయే ప్రధాన కారణమని కేంద్రమంత్రి మునియప్ప తెలిపారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీయే ప్రధాన కారణమని కేంద్రమంత్రి మునియప్ప తెలిపారు.  హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణకు స్వేచ్ఛ, స్వతంత్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అధినేత్రి  సోనియా గాంధీనే అని మునియప్ప అన్నారు. 
 
రైల్వేశాఖామంత్రిగా తెలంగాణకు 15వేల కోట్ల రూపాయలను కేటాయించానని మునియప్ప తెలిపారు. రైల్వే లైన్లు అభివృద్ధి చేయడమే కాకుండా తెలంగాణ ప్రాంతానికి కొత్త రైళ్లను కేటాయించామన్నారు.
 
తెలంగాణ ప్రాంతంలో అభివృద్దికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు.  కర్ణాటకలో 28 ఎంపీ సీట్లలో 20 కాంగ్రెస్‌ గెలుస్తుందని మునియప్ప ధీమా వ్యక్తం చేశారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement