తెలంగాణలోని పలువురు ఉద్యోగులు ఏపీకి | Some of Ap employees to telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలోని పలువురు ఉద్యోగులు ఏపీకి

Jul 20 2017 1:03 AM | Updated on Aug 18 2018 8:05 PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న 61 మంది నాన్‌ గెజిటెడ్, నలుగురు నాల్గో తరగతి ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది.

సాక్షి, అమరావతి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న 61 మంది నాన్‌ గెజిటెడ్, నలుగురు నాల్గో తరగతి ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో పనిచేస్తున్న 13 మంది గెజిటెడ్‌ అధికారులను తెలంగాణకు పంపించేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. అంతే సంఖ్యలో తెలంగాణలో పనిచేస్తున్న 13 మంది గెజిటెడ్‌ అధికారులను తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ మేరకు విభజన సమస్యలపై ఏర్పాటైన అధికారులతో కూడిన కమిటీ నిర్ణయం తీసుకోవడంతోపాటు మార్గదర్శకాలు జారీచేసింది. ఆంధ్రప్రదేశ్‌ స్థానికత కలిగిన 61 మంది నాన్‌ గెజిటెడ్, నలుగురు నాల్గో తరగతి ఉద్యోగులు పంపిణీ సందర్భంగా ఏపీ అప్షన్‌ ఇచ్చినా తెలంగాణకు కేటాయించారు. వీరందిరినీ తెలంగాణ ప్రభుత్వ అంగీకారంతో ఏపీ తీసుకోవాలని సాధారణ పరిపాలనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లింగరాజు పాణిగ్రహి నేతృత్వంలో ఇటీవల జరిగిన కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement